జీసీసీ పెట్రోల్ బంకుల ఆదాయం పెరిగేలా నిర్వహించాలి
ఉట్నూర్, ఆంధ్రప్రభ: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులను పకడ్బందీగా నిర్వహిస్తూ ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమల్ల సందీప్ కుమార్ సూచించారు. గురువారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, కాగజ్‌నగర్, బెజ్జూర్ మండలాల్లోని జీసీసీ పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఇంధన విక్రయాలు, ఆదాయ–వ్యయాల వివరాలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అనవసర ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచే దిశగా పనిచేయాలని సూచించారు. వేతనాల పెంపుపై సిబ్బంది చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని, సముచితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీసీసీ ఉట్నూర్ సీనియర్ మేనేజర్ సంతోష్ కుమార్, కాగజ్‌నగర్ మేనేజర్ మనోహర్, సిబ్బంది సత్యనారాయణ, ప్రకాష్, ప్రదీప్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
