భూభారతి రిసర్వే అవగాహన సదస్సు..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూభారతి రీసర్వే అవగాహన సదస్సు కార్యక్రమం లో భాగంగా భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ ఎంఏ. సమీర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఏడి శ్రీనివాస్ రావు, డిఏ ఆర్మూర్ డిప్యూటీ సుప్రిండెంట్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీ సర్వే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి. భూముల రీసర్వే పై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా అన్ని విధాలుగా అధికారులకు సాయాసాకారాలు అందించాలని అన్నారు. తహసిల్దార్ ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు రెవెన్యూ అధికారులు అన్ని విధాలుగా సహకారం అందిస్తాం భూముల రీసర్వే పై సహకరించాలని కొని ఆడారు.

అలాగే బాధ్యతలు స్వీకరించిన తరాణంలో మొదటిసారి బాబాపూర్ గ్రామపంచాయతీ వచ్చినా సందర్భంగా నూతన తహసిల్దార్ ఎం.కిరణ్ కుమార్ ను సర్పంచ్ సమీర్, పాలకవర్గం సభ్యులు ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ.మల్లేష్, సర్వేయర్ శ్రీనివాస్, రామచందర్, పంచాయత్ కార్యదర్శి సంతోష్, ఉప సర్పంచ్ మంద గోవర్ధన్, వివిధ శాఖల అధికారులు, వార్డ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.