భీమా రంగ పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలి

నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ: భీమా రంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని ఐసీఈయూ ఉపాధ్యక్షులు పెరుమాళ్ల మల్లేశం పిలుపునిచ్చారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్-1 కార్యాలయంలో బుధవారం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఈయూ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెరుమాళ్ల మల్లేశం సంఘ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎల్‌ఐసీ బ్రాంచ్-1 మేనేజర్ ఏ. వెంకటేశ్వరరెడ్డి, ఏఓఐ రాష్ట్ర నాయకులు నలపరాజు సైదులు, బి. రామలింగం, క్లాస్-2 ఫెడరేషన్ నాయకుడు వెంకటేశ్వర్లు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఐసీఈయూ నల్లగొండ బ్రాంచ్-1 అధ్యక్షుడు కొప్పు వెంకన్న, కార్యదర్శి ఐతగోని లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఉద్యోగి వేముల కృష్ణయ్య, ఏఏఓలు కరుణ, వంశీకృష్ణారెడ్డి, ఐసీఈయూ ప్రతినిధులు ఎస్. సందీప్, పల్లపు లింగయ్య, ఎం. రామకృష్ణ, గుండగోని శ్రీనివాస్, వింజమూరి శ్రీనివాస్, లకడాపురం రామకృష్ణ, దేవగిరి అంజయ్య, పాలెం శ్రీకాంత్, కాటం వెంకటేశం, ఎన్. రామకృష్ణ, పరాంకుశం గోపికృష్ణ, బొల్లు సుధాకర్‌తో పాటు పెద్ద సంఖ్యలో భీమా ఉద్యోగులు పాల్గొన్నారు.