ఆర్టీసీ బస్ స్టేషన్ లో చలివేంద్రం ప్రారంభం

ఆర్టీసీ బస్ స్టేషన్ లో చలివేంద్రం ప్రారంభం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల దాహార్తిని తీర్చడం కోసం స్థానిక శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణ రామ్ చౌదరి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ రామ్ చౌదరి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా బస్ స్టేషన్ ప్రాంగణంలో వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రయాణికుల దప్పిక తీర్చేందుకు తాము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపడతామని తెలిపారు. వ్యాపారంతో పాటు తాము సమాజ సేవలోను ముందు ఉంటామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్లు బొప్పని ఆనందరావు, యాదయ్య, స్థానికులు కాసుల రఘు, ముత్యాల హనుమంత రెడ్డి, రాజేష్, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు పాల్గొన్నారు

Leave a Reply