రవాణా శాఖ మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు శనివారం హైదరాబాదులో కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం విద్యా సంస్థలు ప్రారంభం అయినందున ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. స్పందించిన మంత్రి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనను కలిసిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు దేవరాజు గౌడ్, లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మాజీ జడ్పిటిసి నంద రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్ ఆనంద్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లాడి సుదర్శన్ ఉన్నారు.
