ఎస్‌ఐఆర్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి..

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ 18వ వార్డు పరిధిలోని 58, 74 పోలింగ్ బూత్‌లలో శనివారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు బీఎల్‌ఏలతో కలిసి ఇంటింటి సందర్శన చేపట్టి ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా నాయకులు ఓటర్లతో మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ద్వారా ఖచ్చితమైన, నిజమైన ఓటర్లను గుర్తించడం సాధ్యమవుతుందని తెలిపారు. దీంతో ఎన్నికల్లో జరిగే అవకతవకలను నివారించవచ్చని వివరించారు.

ఎస్‌ఐఆర్ బాధ్యతాయుతమైన కార్యక్రమమని, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ-2 ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి సమగ్రంగా పరిశీలన చేపట్టాలని సూచించారు. డూప్లికేట్ ఓటర్లు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలను గుర్తించి ఓటరు జాబితాను సరిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పల్లె రాజు, టౌన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, బీఎల్‌ఏ-2 ఏజెంట్లు రాగిశెట్టి రాజన్న, సల్మాన్ జిబ్బు, నాగరాజ్, రాజన్న, ఇబ్రహీం, రవీందర్, పసరగొండ కృష్ణకాంత్, బీఎల్‌ఏలు గంగా, మంగా తదితరులు పాల్గొన్నారు.