కార్యకర్తల సంక్షేమ నిధి అందజేత…

పాయకాపురం, ఆంధ్రప్రభ : పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మొదటి ప్రాధాన్యత 21 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.21 లక్షల ప్రమాద బీమా చెక్కులను ఎమ్మెల్యే బొండా ఉమా సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో మృతిని కుటుంబాలకు స్వయంగా అందజేశారు.తెలుగుదేశం పార్టీ అనేది కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ అని అన్నారు. పార్టీ జెండాను భుజాన మోసి, తెలుగుదేశం పార్టీ విజయాల కోసం జీవితాంతం కష్టపడిన కార్యకర్తల సేవలను ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్,పార్లమెంట్ కార్యదర్శి ఎస్. కె.గౌసియా, కంచేటి నాగరాజు, దాసరి కనకారావు, మరక శ్రీను, కంచి ధన శేఖర్, గౌస్ బాషా, పైడి శ్రీను, జలకం రాజా, లబ్బా వైకుంఠం, మోతుకూరి కాసిం, రాజన బంగారునాయుడు, బుదాల సురేష్, పలాగని శివ, అమర్నాథ్ గౌడ్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.