నేటి యువతకు రాహుల్ గాంధీ ఆదర్శప్రాయుడు..
హసన్‌పర్తి, ఆంధ్రప్రభ : రాజకీయాల్లో ధైర్యం, నిబద్ధత అత్యంత అవసరమైన ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న రాహుల్ గాంధీ నేటి యువతకు ఆదర్శప్రాయుడని హనుమకొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ అన్నారు.
భారత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని జీడబ్ల్యూఎంసీ 65వ డివిజన్ చింతగట్టులో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేఆర్ దిలీప్ రాజ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా దిలీప్ రాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, విలువల పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అంకితభావాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం రాహుల్ గాంధీ నిరంతరం నిలబడుతున్నారని పేర్కొన్నారు.
దేశం కోసం అసాధారణ త్యాగాలు చేసిన కుటుంబ వారసత్వాన్ని రాహుల్ గాంధీ వినయంతో, అంకితభావంతో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం, శక్తి కలగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, జిల్లా నాయకులు కర్ర హరీష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం వరుణ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నద్దునూరి రవీందర్, జట్టి యుగంధర్, వర్ధన్నపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, గౌడ సంఘం అధ్యక్షుడు జనగాని సురేష్, ఉపాధ్యక్షుడు చింత ప్రణీత్, ప్రధాన కార్యదర్శి ముంజ శ్రీకాంత్, సభ్యులు సురేందర్, రాజేంద్రప్రసాద్, డివిజన్ యూత్ నాయకులు బత్తుల రాజేందర్, బూర ప్రసాద్, సీనియర్ నాయకులు సాగర్, నద్దునూరి యువరాజ్, నోముల ప్రశాంత్, నద్దునూరి కిషన్, చందు, రాజ్‌కుమార్, ఆశిష్, సన్నీ సాయి తదితరులు పాల్గొన్నారు.
