5: 00 P.M. | 19 జూన్ 2026 ముఖ్యాంశాలు
Cyberabad EOW | బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్
Cyberabad EOW | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విధించిన మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులు ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. click here to read full news
‘నన్ను కాదు.. కలెక్టర్‌ను అడగండి’..
మద్దిరాల, ఆంధ్రప్రభ : మద్దిరాల క్రాస్‌రోడ్డు ప్రాంతంలోని ఓ ఎరువుల దుకాణంలో యూరియా బస్తాల విక్రయంలో అదనపు ధరలు వసూలు చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుకాణ నిర్వాహకురాలు రైతులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. click here to read full news
Birthday celebrations | ఖర్గే సమక్షంలో రాహుల్ కేక్ కటింగ్
Birthday celebrations | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) జన్మదిన వేడుకలు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వద్రా (Priyanka Gandhi Vadra)తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో రాహుల్ గాంధీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. click here to read full news
Rangareddy | యూరియా కలిపిన నీరు తాగి 10 ఆవులు మృతి?
Rangareddy | రంగారెడ్డి, ఆంధ్రప్రభ ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం కుమ్మరిగూడ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యూరియా కలిపిన నీటిని తాగినట్లు అనుమానిస్తున్న పది ఆవులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఒక్కసారిగా పది పాడి పశువులు మృతిచెందడంతో యజమాని కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. click here to read full news
SaiKrishna Missing Case | సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాం…
SaiKrishna Missing Case |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: విజయవాడలో సంచలనం రేపిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. click here to read full news
Congress | వనరుల సమీకరణపై భట్టి విక్రమార్క సమీక్ష
Congress | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ, ప్రభుత్వ ఆదాయ పెంపు, సంక్షేమ పథకాల అమలుకు నిధుల సమకూర్పు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణపై సమగ్రంగా చర్చించారు. click here to read full news
day care center | చిన్నారుల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత
day care center | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : చిన్నారుల ఆరోగ్యం, ఆనందం, సమగ్ర వికాసమే అసలైన అభివృద్ధికి పునాది అని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో తొలి అంగన్వాడీ-కమ్-పాలన (డే కేర్) కేంద్రాన్ని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని అరుంధతి నగర్లో ప్రారంభించిన ఆమె, చిన్నారుల సంరక్షణను ప్రభుత్వ బాధ్యతగా భావిస్తూ వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. click here to read full news
Revanthreddy | గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్..
Revanthreddy |హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కీలక అనుమతులు లభించాయి. హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పనులకు అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. click here to read full news
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
