డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తా చెదారం

డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తా చెదారం

  • పడకేసిన పారిశుధ్యం

హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; ఒకవైపు ప్రజా పాలన. ప్రగతి ప్రణాళిక ఆర్భాటంగా కొనసాగుతుండగా.. మరోవైపు హనుమకొండ జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని హసన్ పర్తి 66వ డివిజన్ కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది.డ్రైనేజీలలో చెత్త చెదారం, వ్యర్థాలు పేరుక పోయి, దిగువకు మురికి పారడం లేదు. దీంతో శుభ్రత కనుమరుగైంది. డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ నగర్ తో పాటు పలు కాలనీలలో పక్కా మురికి కాల్వలలో చెత్తాచెదారం,ప్లాస్టిక్ వ్యర్ధాలు నిలిచిపోయి..కంపు కొడుతున్నా.. శానిటరీ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.అంబేద్కర్ నగర్ లో పెంబర్తి వైపు వెళ్లే రహదారిలో పక్కా మురికి కాల్వల పరిస్థితి మరింత అద్వానంగా మారింది.

కాల్వలను ఎప్పుడు శుభ్రం చేస్తారో తెలియని అయోమయమైన వాతవరణం నెలకొంది. చెత్త చెదారం మూలంగా కాలువలో నీరు నిలిచిపోయి.. దుర్గందంతో పాటు దోమలు చెలరేగడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధంతోపాటు పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యతను నిస్తున్నట్లు సమావేశాలలో అధికారులు మాట్లాడుతున్నారు. కాని డివిజన్ లోఎక్కడా ఆ పరిస్థితి కానరావడం లేదు.

కనీసం 15 రోజుల కొకసారైనా పక్కా మురికి కాలువలను శుభ్రం చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక ప్రారంభంలోనే స్థానిక శానిటరీ ఇన్స్ స్పెక్టర్ తమ సిబ్బందితో పచ్చదనం..పరిశుభ్రతపై తూ.. తూ మంత్రంగా అవగాహన ర్యాలీ నిర్వహించి చేతులు దులుపుకున్నారు. అనంతరం పారిశుధ్యంపై ఏలాంటీ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ లో మురికి కాలువలు శుభ్రతకు ఏలాంటీ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు వాపోయారు.ఇప్పటికైనా శానిటరీ అధికారులు తమ సిబ్బందితో ఎప్పటికప్పుడు పక్కా మురికి కాల్వలను శుభ్రపరిచి,ప్రజలను కలుషిత వాతావరణం నుండి కాపాడాలని కోరుతున్నారు.

Leave a Reply