ఏజెన్సీలో మెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం అదిలాబాద్ జిల్లా పాత ఉట్నూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓం సాయ్ మెడికల్,డే కేర్ క్లినిక్ ను ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ తో కలిసి నిర్మల్ డిసిసి అధ్యక్షులు,ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం దీని ద్వారా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యాధికారితో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, అదిలాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ డిసిసి ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దాసండ్ల ప్రభాకర్, లక్కరాం మాజీ సర్పంచ్ మరసుకోల తిరుపతి, షాంపూర్ మాజీ సర్పంచ్ జాదవ్ జగదీష్, వైద్య అధికారి సంతోష్, ఉపాధ్యాయ సంఘం నాయకులు రవికుమార్, కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి మహేందర్, బిరుదుల లాజర్, అచ్చ దేవానంద్, తదితరులు పాల్గొన్నారు.