ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి..

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి..

  • ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేసిన సర్పంచ్ సంగీత

కడెం, ఆంధ్రప్రభ : గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ డి.ఎస్. సంగీత రాజేష్ కోరారు.

శుక్రవారం కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను సర్పంచ్ డి.ఎస్. సంగీత రాజేష్, ఉప సర్పంచ్ జంగం రమేష్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పలు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనిత, ఉపాధ్యాయుడు సాయికిరణ్, పంచాయతీ కార్యదర్శి నరేష్, అంగన్‌వాడీ టీచర్ భూపేందర్ కౌర్, జీపీ వార్డు సభ్యులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.