మహాగాంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మహాగం గ్రామపంచాయతీలో శుక్రవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ సెడమకి జానే రావు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలోని మంచినీటి పథకాల వద్ద క్లోరినేషన్ చేపట్టడంతో పాటు వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామాభివృద్ధిలో పారిశుద్ధ్యం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కారోబార్ ఆత్రం బాపూరావు, ఆశా వర్కర్ మెస్రం రాధిక, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
