బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌కు లక్కీ డ్రా

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకం కింద విద్యార్థుల ప్రవేశాల కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి సుకీర్తి తెలిపారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఈ పథకం కింద ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం 41 సీట్లు, ఐదో తరగతిలో ప్రవేశాల కోసం 43 సీట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు.అర్హులైన విద్యార్థుల ఎంపిక కోసం ఈ నెల 19వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు.దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై లక్కీ డ్రా కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సుకీర్తి కోరారు.