WGL | తెలంగాణ నయాగరా.. బొగత వ‌ద్ద ప‌ర్యాట‌కుల సంద‌డి

వ‌రంగ‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నైరుతి రుతుపవనాల ప్ర‌భావంతో అట‌వీ ప్రాంతంలో కురుస్తున్న వ‌ర్షాల‌తో ములుగు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాజేడు మండలంలో ఉన్న బొగత జ‌ల‌పాతం (తెలంగాణ నయాగరా ఫాల్స్) లో జ‌ల‌క‌ళ సంత‌రించుకుంది. దీంతో చుట్టుప‌క్క‌ల ఉన్న ప్ర‌జ‌లు జ‌ల‌పాతాన్ని తిల‌కించ‌డానికి చేరుకున్నారు. దీంతో ప‌ర్యాట‌కుల సంద‌డి నెల‌కొంది. ఈ జలపాతం సుమారు 30అడుగుల ఎత్తు నుంచి పలు సమాంతర పాయలలో కిందికి నీరు పడుతూ, దిగువన పెద్ద నీటి కొలను కనువిందు చేస్తుంది.

Leave a Reply