అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత

  • మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని జడలుపేట శివారు గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రత్న అంకూస్ (85) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు.సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంకూస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంకూస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. జీవితాంతం పార్టీ బలోపేతానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాల పట్ల అంకితభావంతో పనిచేసిన అంకూస్ సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు కామిడి రత్నాకర్ రెడ్డి, పులి తిరుపతి రెడ్డి, దబ్బేట రమేష్, బొట్ల రవి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.