నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇది కూటమి విజయం.
నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇది కూటమి విజయం.
విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు కూటమిపై (టీడీపీ, బీజేపీ, జనసేన) పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్.డి.ఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడువేల పించన్ను ఏకంగా ఆరువేల పింఛన్ అందజేయడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ ఐవీ ప్యాలెస్ కళ్యాణ మండపంలో గురువారం రెండు సంవత్సరాలు ఎన్.డి.ఏ ప్రభుత్వం విజయవంతమైన ప్రగతి నివేదన సభ ఘనంగా నిర్వహించారు.రెండు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ పరిధిలోని జరిగిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. ప్రతినెలా 11కోట్ల రూపాయల తో పించన్ అందజేస్తూ పించన్ దారులకు సంక్షేమం అందజేస్తున్నామని అన్నారు.
అన్నీ గుర్తుంటాయి…
పార్టీ కొరకు కష్టించే ప్రతి కార్యకర్తను గుర్తుంచుకొంటామని ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. ప్రభుత్వం ఎటువైపు ఉంటే అటువైపు వచ్చే నాయకులను వాళ్ళను కూడా గుర్తుంచుకొంటామని తగిన రీతిలో ప్రభుత్వ పథకాలు, పదవులు అందుతాయని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీ శ్రేణులకు వివిధ కార్పోరేషన్లో చైర్మన్,దేవస్థానం కమిటీ లలో పదవులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు గద్దె అనురాధ, బిజేపీ శర్మ, జనసేన వంశీ, ఏపీ బొక్వా చైర్మన్ గొట్టుముక్కల రఘు, లుక్కా సాయిరాం,సెంట్రల్ మహిళ అధ్యక్షురాలు పైడి తులసి,టీడీపీ మాజీ కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి,విరమాచనేని లలిత, టీడీపీ అధ్యక్షుడు కె.రవికుమార్వరలక్ష్మీ,ఆకుల సూర్యప్రకాష్,కంచేటి నాగరాజు,బుదాల సురేష్, డిడి నాయుడు,లక్కీశెట్టి సాయి,సోమన అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
