అత్యుత్తమ కలెక్టర్ గా కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ

అత్యుత్తమ కలెక్టర్ గా కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో కృష్ణా జిల్లా కలెక్టర్ అత్యుత్తమ కలెక్టర్ గా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎంపికయ్యారు. ప్రముఖ రేటింగ్ మ్యాగజైన్ ఫేమ్ ఇండియా_ తన సర్వే ఫలితాల్లో 100 మంది జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలోని “అత్యుత్తమ, ఉత్తమ పనితీరు కనబరిచిన” పరిపాలనాధిపతులుగా పేర్కొంది. వారిలో అత్యంత ప్రతిభావంతులైన 25 మందిని 2026 ఎడిషన్‌లో ప్రచురించనుంది.
ఏసియా పోస్ట్ సహకారంతో నిర్వహించిన ఈ సర్వే, దేశవ్యాప్తంగా దాదాపు 800 జిల్లాలను పరిశీలించి, నిపుణుల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి నివేదికలు, మీడియా విశ్లేషణ ఆధారంగా చివరికి 100 మంది పేర్లను ఎంపిక చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎంపిక కావడం పట్ల సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్ పలువురు జిల్లా అధికారులు ప్రశంసిస్తూ కలెక్టర్ ను అభినందించారు.
