June17 | కొత్త శాఖ ప్రారంభించిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్..
June17 | కొత్త శాఖ ప్రారంభించిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్..
తెలంగాణలో మరింత విస్తరణ
జీరో లాగిన్ ఫీజు.. రూ.50 లక్షల వరకు స్పాట్ లోన్ మంజూరు ప్రత్యేక ఆఫర్
June17 | హైదరాబాద్, తెలంగాణ : ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఏబీహెచ్ఎఫ్ఎల్), దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలో భాగంగా సంగారెడ్డిలో కొత్త శాఖను ప్రారంభించింది. తద్వారా తెలంగాణలో సంస్థ ఉనికిని మరింత పటిష్టం చేసుకుంటూ, ఈ ప్రాంతంలో తన మొత్తం బ్రాంచ్‌ల సంఖ్యను 10కి పెంచుకుంది. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేసింది.
ఇండోర్–హైదరాబాద్ ఎకనమిక్ కారిడార్ దన్నుతో తెలంగాణలో కీలక పారిశ్రామిక కేంద్రంగా సంగారెడ్డి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కారిడార్ తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వ్యాప్తంగా వాణిజ్యం, కనెక్టివిటీని పెంచేందుకు తోడ్పడగలదనే అంచనాలు ఉన్నాయి. పారిశ్రామిక వృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు ఇటు వేతన జీవుల్లో, అటు స్వయం ఉపాధి పొందే వర్గాల్లో అఫోర్డబుల్ హౌసింగ్, హౌసింగ్ ఫైనాన్స్‌కు డిమాండ్ ఏర్పడేందుకు తోడ్పడనున్నాయి. గృహాల కొనుగోలు, నిర్మాణం, మెరుగుదలల కోసం కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన రుణ సాధనాలను అందించేందుకు ఈ కొత్త ఏబీహెచ్ఎఫ్ఎల్ శాఖ తోడ్పడనుంది.
వేతన ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే నిపుణులు, వ్యాపారస్తులు, వర్ధమాన ఆదాయ వర్గాల వంటి వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు తోడ్పడేలా ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ విభిన్నమైన గృహ రుణ సేవలను అందిస్తోంది. ఇందులో అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్, ప్రైమ్ హౌసింగ్, కన్స్ట్రక్షన్ ఫైనాన్స్, ప్రాపర్టీపై రుణాలు ఉన్నాయి. పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ సహాయంతో కస్టమర్లకు సులభమైన ఆన్‌బోర్డింగ్, వేగవంతమైన లోన్ అప్రూవల్స్, పారదర్శకతను అందిస్తూ కంపెనీ అత్యుత్తమ సేవా అనుభవాన్ని అందిస్తోంది.
ఈ కొత్త శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా 2026 జూన్ 17 నుంచి జూన్ 30 వరకు కస్టమర్లకు సంస్థ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఎటువంటి లాగిన్ ఫీజు లేకుండా, రూ. 50 లక్షల వరకు రుణాలను తక్షణం మంజూరు చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల కస్టమర్లు చాలా వేగంగా, తక్కువ వ్యయాలతో రుణాలను పొందే అవకాశం ఉంటుంది.
“తెలంగాణ మాకు అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్. పటిష్టమైన డిమాండ్, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ప్రాంతీయంగా మా కార్యకలాపాలను విస్తరిస్తున్నాము. మా విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్‌ను, అధునాతన డిజిటల్ సాంకేతికతతో జోడించి, కస్టమర్ల సొంతింటి కలను మరింత సరళంగా, వేగవంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాకారం చేయడమే మా లక్ష్యం” అని ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ పంకజ్ గాడ్గిల్ పేర్కొన్నారు.
తమ కస్టమర్లకు ‘హ్యాపీ హోమ్ లోన్ జర్నీ’ అందిస్తామనే వాగ్దానానికి కట్టుబడి, బాధ్యతాయుతమైన విధంగా రుణాల పంపిణీ నిర్వహించడం, ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడంపై ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నిరంతరం దృష్టి సారిస్తోందనడానికి సంస్థ కార్యకలాపాల విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది. మరింత సమాచారం కోసం: https://homefinance.adityabirlacapital.com/
