కౌసల్య దేవి ఫౌండేషన్ సేవలు ఆదర్శం

కౌసల్య దేవి ఫౌండేషన్ సేవలు ఆదర్శం

బిక్కనూర్, ఆంధ్రప్రభ:
పట్టణానికి చెందిన కౌసల్య దేవి ఫౌండేషన్ సేవలు సమాజానికి ఎంతో ఆదర్శమని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు.బుధవారం పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే అనుభవం గల ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరుగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ రేఖా సుదర్శన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, కౌసల్య దేవి ఫౌండేషన్ చైర్మన్ జ్ఞాన ప్రకాష్ రెడ్డి, సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.