యూరియా యాప్ సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి: రైతుల విజ్ఞప్తి

యూరియా యాప్ సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి: రైతుల విజ్ఞప్తి

ఎడపల్లి, ఆంధ్రప్రభ:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంప్, బ్రాహ్మణపల్లి, దుబ్బదండ గ్రామాల్లో గురువారం గ్రామసభలు ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన నిర్వహించారు.

గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై గ్రామసభల్లో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమాలకు తహసీల్దార్ దత్తాత్రి, ఎంపీడీవో శంకర్ నాయక్, ఎడపల్లి ఎస్‌ఐ ముత్యాల రమ, మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు.

బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రైతులు యూరియా యాప్ వినియోగంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆన్‌లైన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యల కారణంగా ఎరువుల కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

యూరియా యాప్‌లోని సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామసభ వేదికగా విజ్ఞప్తి చేశారు.

రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply