Stock Market Rally | స్టాక్ మార్కెట్లు గ్రీన్ జోన్‌లో ఫినిష్

Stock Market Rally | స్టాక్ మార్కెట్లు గ్రీన్ జోన్‌లో ఫినిష్

Stock Market Rally |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం భారీ లాభాలతో ప్రారంభమై ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా అదే జోరును కొనసాగించాయి. కొనుగోళ్ల ఊపుతో కీలక సూచీలు గ్రీన్ జోన్‌లో ముగిశాయి.

రోజు ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 736.38 పాయింట్లు లేదా 0.97 శాతం లాభపడి 76,264.33 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 231.00 పాయింట్లు లేదా 0.98 శాతం పెరిగి 23,853.90 వద్ద ముగిసింది. ఈ రోజు ట్రేడింగ్‌లో మెగెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్, ఏబీ కాట్‌స్పిన్ ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి.

అయితే అన్ని రంగాలు లాభాల్లోనే ముగియలేదు. శార్దూల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎక్సారో టైల్స్ లిమిటెడ్ వంటి కొన్ని కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేసి టాప్ లూజర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మొత్తంగా, వారంలో తొలి ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూల ధోరణిని ప్రదర్శిస్తూ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి.