చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డి
చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం పాలకుర్తి నియోజకవర్గం కన్వీనర్,ప్రజా గాయకుడు పంజాల బుచ్చి రాములు గౌడ్-అరుణ కుమార్తెలు హిమబిందు, రిహ గౌడ్‌ల నూతన పుష్పలంకరణ వేడుకలను ఆదివారం మండలంలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు హాజరై చిన్నారులను ఆశీర్వదించి వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులను అభినందించి, హిమబిందు, రిహ గౌడ్‌లు విద్యా, సాంస్కృతిక రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్ ముద్దసాని సురేష్, ఏఎంసి డైరెక్టర్ వెంకటాచారి,నాయకులు జీనుగా సురేందర్ రెడ్డి,వెంకన్న యాదవ్, మోత్కూరి రవీంద్ర చారి, విస్సంపల్లి బాలకృష్ణ,పంజా కల్పన రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్, పంజాల మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
