Maheshbabu Next Movie | బుచ్చిబాబు ఒక్క మాటతో టాలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ!
Maheshbabu Next Movie | బుచ్చిబాబు ఒక్క మాటతో టాలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ!
Maheshbabu Next Movie | ‘పెద్ది’ విజయోత్సవ సభలో ఆసక్తికర ప్రశ్న
బుచ్చిబాబు సమాధానంతో పెరిగిన ఉత్కంఠ
మహేష్ కోసం పౌరాణిక కథ సిద్ధమా?
అభిమానుల్లో కొత్త ఆశలు రేపిన వ్యాఖ్యలు
Maheshbabu Next Movie | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. గత కొంతకాలంగా ఆయన మూడో చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన ‘పెద్ది’ విజయోత్సవ సభలో ఓ రిపోర్టర్.. “మీ తదుపరి సినిమా మహేష్ బాబుతోనేనా?” అని నేరుగా ప్రశ్నించగా, బుచ్చిబాబు ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
“సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతాను… కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది” అంటూ చిరునవ్వుతో ఆయన స్పందించారు. అయితే ఈ వ్యాఖ్యలతో ప్రచారంలో ఉన్న వార్తలను ఆయన ఖండించలేదు… అలాగని ధృవీకరించలేదు కూడా. దీంతో మహేష్-బుచ్చిబాబు కాంబోపై అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది.
ఇదిలా ఉండగా… సినీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం మహేష్ బాబు కోసం బుచ్చిబాబు ఓ భారీ పౌరాణిక కథను సిద్ధం చేస్తున్నారట. రాజమౌళి సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మరోవైపు, తన సినిమాల్లో ప్రత్యేకంగా సందేశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కథలు రాయనని బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే అభిమానుల దృష్టి మాత్రం ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపైనే నిలిచిపోయింది.
అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా… బుచ్చిబాబు చెప్పిన “కాలమే సమాధానం చెబుతుంది” అనే ఒక్క డైలాగ్‌తో మహేష్ బాబు అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్స్‌పైకి వెళ్తుందా? లేక ఇది కేవలం ప్రచారానికే పరిమితమవుతుందా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
CLICK HERE TO READ Allu Arjun Fans | ’హ్యాపీ’ రీ రిలీజ్ తో అత్యధిక వసూళ్లు..
