1-Dead-1-Missing : పడవ బోల్తా ఒకరు మృతి Andhra Prabha Crime News

1-Dead-1-Missing : పడవ బోల్తా ఒకరు మృతి Andhra Prabha Crime News

  • మరొకరు గల్లంతు.. ఇంకొకరు సురిక్షతం
  • పల్నాడు జిల్లాలో విషాదం
  • చేపల మేతకు వెళ్లిన ముగ్గురు కూలీలు
  • పడవ బొల్తా ..ఈదుతూ ఒకరు ఒడ్డుకు చేరిక
  • ఒకరి మృతదేహం లభ్యం
  • మరొకరి కోసం గాలింపు

నరసరావుపేట (ఆంధ్రప్రభ) :

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని కాకాని చేపల చెరువులో పడవ మునిగి ఇద్దరు కూలీలు గల్లంతు కాగా.. వారిద్దరూ దుర్మరణం చెందారని అనుమానిస్తున్నారు. చెరువులో చేపలకు ఆహారం వేసేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పడవలో ముగ్గురు కూలీలు వెళ్లారు.

ఇంతలో చెరువులో పడవ బోల్తా పడవటంతో ఓ కూలీ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్ళు చెరువులో గాలిస్తున్నారు. పిట్టంబండ్ల హస్సాన్ బుడే (53),అగ్రహారం హుస్సేనా (32) గల్లంతయ్యారు.

ఇరువురిలో హస్సాన్ బుడే మృతదేహం లభించింది. ,మరొకరి కోసం ఫైర్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply