World Boxing Cup 2026 | భారత జట్టుకు అదనపు బలం..
World Boxing Cup 2026 | భారత జట్టుకు అదనపు బలం..
- చైనాలో జరిగే వరల్డ్ బాక్సింగ్ కప్ స్టేజ్-2
- 20తో మంది భారత జట్టు
- జ్యోతి, ఆకాశ్‌కు అవకాశం..
ఆంధ్రప్రభ: చైనాలోని గుయాంగ్ వేదికగా సోమవారం (జూన్ 15) నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ బాక్సింగ్ కప్-2026 (World Boxing Cup) (స్టేజ్-2) పోటీల కోసం భారత జట్టులో ఇద్దరు అదనపు బాక్సర్లను చేర్చారు. 48 కేజీల విభాగంలో జ్యోతి, 75 కేజీల విభాగంలో ఆకాశ్ భారత బృందంలో చోటు దక్కించుకున్నారు.
మొదట ప్రకటించిన తుది జట్టులో వీరిద్దరి పేర్లు లేకపోయినా, భారత బాక్సింగ్ సమాఖ్య (BFI) అధ్యక్షుడు అజయ్ సింగ్ ప్రత్యేక చొరవ తీసుకుని వారి భాగస్వామ్యాన్ని ఖరారు చేశారు. ఈ అవకాశంతో జ్యోతి, ఆకాశ్‌లకు అంతర్జాతీయ స్థాయిలో పోటీ అనుభవం లభించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్ పాయింట్లు సాధించే అవకాశం దక్కనుంది. భవిష్యత్ ప్రధాన టోర్నీలకు సిద్ధమయ్యే క్రమంలో ఇది వారికి కీలకంగా మారనుంది.
జ్యోతి, ఆకాశ్ ఎంపికతో భారత జట్టు బలం 18 నుంచి 20 మందికి పెరిగింది. ప్రస్తుతం జట్టులో 10 మంది పురుషులు, 10 మంది మహిళా బాక్సర్లు ఉన్నారు.
మహిళల జట్టు :
జ్యోతి (48 కేజీలు)
మీనాక్షి (51 కేజీలు)
పూనమ్ (54 కేజీలు)
ప్రాచి (57 కేజీలు)
మహీ లామా (60 కేజీలు)
సనేహ్ (65 కేజీలు)
గిటిమోని జి (70 కేజీలు)
సనమాచా సి (75 కేజీలు)
నైనా (80 కేజీలు)
అల్ఫియా తరన్నుమ్ అక్రమ్ ఖాన్ పఠాన్ (+80 కేజీలు)
పురుషుల జట్టు :
రిషి ఎస్ (50 కేజీలు)
నిఖిల్ (55 కేజీలు)
అన్మోల్ (60 కేజీలు)
అభినాశ్ జంవాల్ (65 కేజీలు)
దీపక్ (70 కేజీలు)
ఆకాశ్ (75 కేజీలు)
మల్సావ్మ్‌ట్లువాంగా (80 కేజీలు)
జుగ్నూ (85 కేజీలు)
హర్ష్ చౌదరి (90 కేజీలు)
సావన్ జి (+90 కేజీలు)
ర్యాంకింగ్ పాయింట్లపై దృష్టి
ప్రపంచ స్థాయి బాక్సర్లతో పోటీ పడే అవకాశాన్ని అందిపుచ్చుకుని భారత బాక్సర్లు మెరుగైన ప్రదర్శన చేయాలని బీఎఫ్‌ఐ భావిస్తోంది. ముఖ్యంగా జ్యోతి, ఆకాశ్ ఎంపికతో భారత జట్టుకు మరింత బలం చేకూరిందని అధికారులు పేర్కొన్నారు.
