ఖరీఫ్ సాగుకు రైతన్నల సై
ఖరీఫ్ సాగుకు రైతన్నల సై
- ఆసిఫాబాద్ జిల్లాలో నాలుగు లక్షల 50 వేలలో పంట సాగుకు సన్నద్ధం
- 80 శాతం పత్తి పంట సాగు
అసిఫాబాద్ నియోజకవర్గ (జైనూర్), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో రైతులు ఖరీఫ్ సాగు పంటకు సన్నద్ధమయ్యారు. అధికారుల అంచనా ప్రకారంగా జిల్లాలో గత ఏడాది పంట సాగు చేసిన ప్రకారం ఆసిఫాబాద్ జిల్లాలో నాలుగు లక్షల 50 ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు.అందులో 3 లక్షల 70 వేల ఎకరాల్లో 80% పత్తి పంట సాగు చేస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 50,000 ఎకరాల్లో వరి, 23 వేల ఎకరాల్లో కంది 7000 ఎకరాల్లో మొక్కజొన్న సోయా 5000 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు అసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ ఆంధ్రప్రభ తో తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగు కై ఇప్పటివరకు రెండు లక్షల టన్నులు రైతులకు ఏరియా ఇవ్వడం జరిగిందని మరో రెండు లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

ప్రతి ఏడాది రైతులు పత్తి పంట సాగుపై మక్కువ చూపిస్తున్న రు. అధిక శాతం ఎరువులు వాడటం వల్ల దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కాగజ్నగర్ డివిజన్లో తక్కువ మోతాదులో ఎరువులు యూరియా ఎరువులు వాడటం వల్ల 15% పైగా వస్తుందని ఆశీర్వాదం నియోజవర్గ పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో ఎక్కువ మోతాదులో యూరియా వాడటం వల్ల దిగుబడి రావటం లేదని అధికారులు పేర్కొంటున్న రైతులు మాత్రం అధిక దిగుబడి కోసం ఎక్కువ మోతాదులో ఎరువులు వాడటం వల్ల నష్టపోతున్నారని తెలుస్తోంది. భూముల్లో పోషక విలువలు తగ్గకుండా ప్రభుత్వాలు ఈ ఏడాది లిక్విడ్ ఎరువులను స్ప్రే రూపంలో అందుబాటులో తెచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు.
రైతులకు నష్టం జరగకుండా భూముల్లో పోషక విలువలు తగ్గకుండా దిగుబడి రావడానికి వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్న రైతుల్లో అవగాహన లోపం వల్ల పంటల దిగుబడి తగ్గకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని గతంలో కంటే యాప్ రూపంలో రైతుకు కావాల్సినంత ఎకరానికి రెండు ఎరువుల బ్యాగుల చొప్పున మంజూరు చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది రైతులు తమ భూముల్లో పంట మార్పిడి చేయకపోవడం వల్ల కూడా నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలోని ఎక్కువ మండలాల్లో వర్షాధార పంటలపై ఆధారపడి పంటలు సాగు చేస్తుండగా అతివృష్టి ఎలా దృష్టి వల్ల పంటలకు నష్టం వాటిల్లడం జరుగుతుంది. అయినా ఎన్నో ఆశలతో రైతులు సన్నద్ధం అయ్యారు.
తమ పంట భూములను చుదును చేసి వ్యవసాయ సాగు ప్రారంభానికి సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ ప్రకారం గా వచ్చే ఎరువులు విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. చాలామంది రైతులు ప్రైవేట్ విత్తన ఏ రువుల దుకాణంలో కొనుగోలు చేసుకుని పంటలు సాగు చేసుకుంటారు. కానీ ఏజెన్సీ మండలాల్లో ఎక్కువ శాతం మంది రైతులు ప్రభుత్వ సబ్సిడీ ఎరువులు విత్తనాలు తో పాటు బ్యాంకు రుణాలపై ఆధారపడి వర్షాధార ఒకే పంట సాగు చేస్తున్నారు. ఏడాది అధిక వర్షాలు లేవని వాతావరణ శాఖ ద్వారా తెలియడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం రైతులకు ఈ పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు కానీ ఎక్కువ శాతం మంది రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించడం వల్ల నష్టపోతున్నారని వ్యవసాయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాది వర్షపాతం తక్కువ ఉందని తెలియడంతో ప్రభుత్వం కూడా రత్నయ పంటగా జొన్న, కంది పంట సాగుపై దృష్టి సారిస్తూ రైతులకు 50 శాతం 100% సబ్సిడీపై కంది జొన్న విత్తనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు ఖరీఫ్ సాగుపై ఎరువులు విత్తనాలు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ ఆంధ్రప్రభ తో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో గత ఏడాది రైతులు నాలుగు లక్షల 50 వేల ఎకరాల్లో పంట సాగు చేశారని ఆయన తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చిన మండల వ్యవసాయ అధికారులకు సంప్రదించాలని, పంట సాగులో వ్యవసాయ అధికారుల సలాహ సూచనలు రైతులు పాటించాలని ఆసిఫాబాద్ డిఏఓ వెంకట్ రైతులకు కోరారు. పంట సాగు చేయకముందే ప్రభుత్వ పరంగా రైతులకు ఇప్పటికే రెండు లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయడం జరిగిందని మరో రెండు లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గోదాముల స్థలం అనుకూలంగా ఎరువుల స్టాక్ లను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
