బాసర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణరావుకు ఘన సన్మానం
బాసర (ఆంధ్రప్రభ): బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మాజీ సర్పంచ్ డి. లక్ష్మణరావును గురువారం పలువురు నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్‌రావు, ఉపసర్పంచ్ సయ్యద్ అలీ, మాజీ సర్పంచ్ అమృత్ పటేల్, సురేష్, మాజీ ఎంపీటీసీ బాల్‌రాజ్, మాజీ ఉపసర్పంచ్ షేక్ సలాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని కోరారు.
