Team India | కెప్టెన్, మాజీ కెప్టెన్ రికార్డుల మోత!
Team India | కెప్టెన్, మాజీ కెప్టెన్ రికార్డుల మోత!
- ఓపెనర్‌గా 16K క్లబ్‌లోకి రోహిత్ శర్మ
- గిల్ కొత్త మైలురాయి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: భారత క్రికెట్‌లో (Team India) ప్రస్తుత కెప్టెన్, మాజీ కెప్టెన్ ఇద్దరూ ఒకే రోజు అరుదైన రికార్డులు నమోదు చేసి వార్తల్లో నిలిచారు. ఆఫ్గానిస్థాన్‌తో ధర్మశాల వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో 3,000 పరుగుల మైలురాయిని అందుకోగా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
శుభ్‌మన్ షో..
భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 3,000 పరుగులు పూర్తి చేసి ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అద్భుతమైన స్థిరత్వంతో పరుగులు చేస్తున్న గిల్.. కేవలం 59 ఇన్నింగ్స్‌ల్లోనే 3,000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ప్రస్తుతం అతని వన్డే సగటు 56.7 కాగా, స్ట్రైక్‌రేట్ దాదాపు 100గా ఉండటం అతని దూకుడు, నిలకడకు నిదర్శనంగా నిలుస్తోంది.
వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 3,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత 59 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్న గిల్ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం 68 ఇన్నింగ్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.

భారత్‌లో నంబర్-1
భారత క్రికెట్ చరిత్రలో 3,000 వన్డే పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యాటర్‌గా గిల్ కొత్త రికార్డు నెలకొల్పాడు.
శుభ్‌మన్ గిల్ – 59 ఇన్నింగ్స్‌లు
శిఖర్ ధావన్ – 72 ఇన్నింగ్స్‌లు
విరాట్ కోహ్లీ – 75 ఇన్నింగ్స్‌లు
కెప్టెన్సీతో పాటు బ్యాట్ జోరు
ఇటీవల భారత జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గిల్.. కెప్టెన్సీ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా పరుగుల వరద కొనసాగిస్తున్నాడు. యువ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తూ, బ్యాటింగ్‌లోనూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు.
ఓపెనర్‌గా 16,000 పరుగులు.. రోహిత్ మరో చరిత్ర!
మరోవైపు, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16,000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకుని మరో చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ‘హిట్‌మాన్’ ఈ ఘనతతో దిగ్గజాల సరసన నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16,119 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ఓపెనర్‌గా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏడో ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు. అయితే ఈ మైలురాయిని చేరుకోవడంలో కూడా రోహిత్ ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు. కేవలం 384 ఇన్నింగ్స్‌లలోనే 16,000 పరుగులు పూర్తి చేసి, ఈ ఫీట్‌ను అత్యంత వేగంగా అందుకున్న ఓపెనర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ 390 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను చేరుకోగా, రోహిత్ ఆ రికార్డును అధిగమించాడు.
ప్రపంచ క్రికెట్‌లో సనత్ జయసూర్య, క్రిస్ గేల్, గ్రేమ్ స్మిత్, డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ ఓపెనర్ల సరసన రోహిత్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఓపెనర్‌గా నిలకడగా పరుగులు సాధిస్తూ భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన రోహిత్.. ఇప్పుడు సెహ్వాగ్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే దిశగా మరో అడుగు ముందుకు వేశాడు.
ఒకవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మరోవైపు భారత బ్యాటింగ్‌కు ఎన్నో విజయాలు అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో మైలురాళ్లు అందుకోవడం భారత అభిమానులకు డబుల్ సెలబ్రేషన్‌గా మారింది.
INDvsAFG-ODI | టీమిండియా జయభేరి
Team India Team India Team India Team India
