ఖమ్మం ఘటన నిందితున్ని కఠినంగా శిక్షించాలి..
ఖమ్మం ఘటన నిందితున్ని కఠినంగా శిక్షించాలి..
- బీసీ సమాజ్, వివిధ కుల సంఘ నాయకుల డిమాండ్
మహబూబ్నగర్ రూరల్, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితున్ని కఠినంగా శిక్షించి, సమాజంలో మరెవరు ఇటువంటి చర్యలు చేయకుండా భయపడే విధంగా ప్రభుత్వం తన పని చేయాలని బీసీ సమాజ్ మరియు రజక సంఘాల నాయకులతో పాటు వివిధ కుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో అఖిల భారత రజక సంఘం అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ రజక బిడ్డ పై జరిగిన ఘటనను అత్యంత హేమమైన చర్యగా భావిస్తున్నామని, ఖాజా పాషా అనే నిందితుని కఠినంగా శిక్షించి సమాజం ముందు ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకొకరు ఇటువంటి సంఘటన చేయాలంటేనే భయపడి విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో బీసీ బిడ్డ పై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నిందితుని కఠినంగా శిక్షించాలని హాస్పిటల్లో చావు బతుకుల్లో పోరాడుతున్న ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని కులవృత్తిని చేసుకొని జీవిస్తున్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల సహకారాలు అందించి అదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..
ఈ సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం కాని ఇతర రాజకీయ పార్టీలు ఏవి కూడా తమకు పట్టనట్లు ఉన్నారని నిందితుని రక్షించే విధంగా ముందుకు పోతున్నారని నిందితునికి కఠిన శిక్ష విధించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్లి భాదిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామన్నారు..
వివిధ కుల సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకటే అని అగ్రవర్ణాల వారికి జరిగితే ఒక న్యాయం బీసీలకు జరిగితే మరొక న్యాయంగా ఈరోజు ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్నారని నిందితుడిని కఠినంగా శిక్షించాలని వాళ్ళు డిమాండ్ చేశారు.
