వృద్ధ దంపతులకు సరదాగ పెళ్లితంతు..

వృద్ధ దంపతులకు సరదాగ పెళ్లితంతు..

  • సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన వీడియో.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పని ప్రదేశంలో పనులు చేస్తున్న కూలీలు సామూహికంగా ఓ వృద్ధ దంపతులకు పెళ్లి తంతు చేసిన వీడియో వైరల్ అయిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్దశనివారం చోటు చేసుకుంది. కూలీలంతా సామూహికంగా ఆదంపతులకు సాంప్రదాయబద్ధంగా పెళ్లి వేడుకలు నిర్వహించి కట్న కానుకలు చదివించడం వేడుకగా కొనసాగింది. ఊట్కూర్ మండల కేంద్రంలోనికుర్వ విదికి చెందిన కటికేరి సాబప్ప కిష్టమ్మ దంపతులకు తోటి కూలీలు దండలు మారుస్తూ పెళ్లి వేడుకలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.