Payakapuram   విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా

Payakapuram   విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా

– పాఠ్యపుస్తకాల పంపిణీ

పాయకాపురం (Payakapuram ), ఆంధ్రప్రభ: విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక 62వ డివిజన్ లాల్ బహదూర్ శాస్త్రి నగర్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హైస్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి నూతన విద్యా సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చేస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, యూనిఫారాలు, షూస్, సాక్స్, బెల్టులు, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తోందని తెలిపారు.

కార్యక్రమంలో టిడిపి మాజీ కార్పొరేటర్ పైడి తులసి, ఇంచార్జి శ్రీను, పార్లమెంట్ కార్యదర్శి ఎస్.కె. గౌసియా, డివిజన్ అధ్యక్షుడు జలకం రాజా, మరియ బాబు, రవణమ్మ, బెజ్జం జయపాల్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.