పునఃప్రారంభానికి ముందే సన్నాహాలు..

మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని న్యూ సాంగ్వి కస్తూర్బా బాలికల పాఠశాలను మండల పంచాయతీ అధికారి లింగాల హరికృష్ణ పరిశీలించారు.

సోమవారం నుంచి పాఠశాల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల పరిసరాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ప్రస్తుతం పంచాయతీ కార్మికులు పాఠశాల ఆవరణలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ్రు అశ్విన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సునీల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.