విత్తన, ఎరువుల దుకాణాలపై సంయుక్త తనిఖీలు

విత్తన, ఎరువుల దుకాణాలపై సంయుక్త తనిఖీలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

డీలర్లకు అధికారుల సూచనలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అచ్చంపేట పట్టణంలోని శ్రీనివాస ట్రేడర్స్ విత్తన, ఎరువుల దుకాణంలో గురువారం రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దుకాణ యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. డీలర్లు తప్పనిసరిగా స్టాక్ బోర్డును ఏర్పాటు చేసి, అందులో నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు విక్రయించిన ప్రతిసారి బిల్లు ఇవ్వాలని, బిల్లుపై రైతు సంతకం, ఫోన్ నంబర్ నమోదు చేయాలని ఆదేశించారు.

ఎంఆర్పీ ధర కంటే అధిక ధరలకు విక్రయాలు చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడువు ముగిసిన విత్తనాలు, ఎరువులను విక్రయించరాదని స్పష్టం చేశారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

ఈ తనిఖీల్లో అచ్చంపేట మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య, అచ్చంపేట ఎస్‌ఐ సద్దాం తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *