పెద్ది దర్శకుడు బుచ్చిబాబుకు ఘన స్వాగతం
పెద్ది దర్శకుడు బుచ్చిబాబుకు ఘన స్వాగతం
హాజిపూర్‌లో పద్మశాలి సంఘం నేత కోట కిషోర్ శుభాకాంక్షలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా నటించిన Peddi చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు Buchi Babu Sanaకు హాజిపూర్‌లో అభిమానులు, స్థానిక ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.
శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యలో హాజిపూర్ వద్ద ఆగిన బుచ్చిబాబును పద్మశాలి సంఘం అధ్యక్షుడు కోట కిషోర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ‘పెద్ది’ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బుచ్చిబాబు అభిమానులు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన Srisailam పుణ్యక్షేత్రం వైపు ప్రయాణం కొనసాగించారు.
