నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీపై నూతనంగా వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సి.హెచ్. సతీష్ ను ఉప్లూర్ గ్రామ సర్పంచ్‌ ఏనుగందుల శైలేందర్ తో పాటు గ్రామ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి మరియు శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.ఎస్సై సతీష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు,అడ్వకేట్ సుంకరి విజయ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ నరేష్,
నజీర్,రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.