డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు నషముక్త భారత్ కార్యక్రమం
డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు నషముక్త భారత్ కార్యక్రమం
యువతను సన్మార్గంలో నడిపించే బాధ్యత సమాజంలో మన అందరిపై ఉంది
రాష్ట్రవ్యాప్త నిర్మూలనకు నడుం బిగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మంచిర్యాల డీసీసీ ఎగ్గడి. భాస్కర్
మంచిర్యాల, ఆంధ్రప్రభ : డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు నషా ముక్త భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి డ్రగ్స్, గంజాయి,మత్తు పదార్థాలకు బానిసలు అయినటువంటి యువతకు అనుభవజ్ఞులైన వైద్యుల సహకారంతో ఔషధాల చికిత్స, కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారిలో మార్పు కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంచిర్యాల డీసీసీ ఎగ్గడి.భాస్కర్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల ఏసిపి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీసీపీ పాల్గొని ముందుగా ఆసుపత్రి ఆవరణంలో మొక్కను నాటి, ఈగల్ ఫోర్స్ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.
డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన నష ముక్త భారత్ కార్యక్రమం ద్వారా 30 మంది మత్తు పదార్థాలకు బానిసలై చికిత్స పొందిన విముక్తి పొందిన అనంతరం మారినటువంటి యువతకు ధ్రువపత్రలు అందజేయడం జరిగిందన్నారు. యువతను సన్మార్గంలో నడిపించే బాధ్యత సమాజంలో మన అందరిపై ఉంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విద్య, వైద్య పై ప్రత్యేక దృష్టి సాధించిందని డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మూలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని యువత ద్వారా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గ్రహించి వారిని సమాజంలో సన్మార్గంలో నడిపించే బాధ్యత మన అందరిపై ఉందని రాష్ట్ర వ్యాప్తంగా పగడ్బందీగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రింబవళ్లు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దానికి ముందు ఏసిపి, వైద్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సిఐ ప్రమోద్ రావు, నర్సింగ్ అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
