Chess | ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం
Chess | ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం
నార్వే చెస్ టైటిల్ విజేతకు రూ.50 లక్షల ప్రోత్సాహకం
Chess | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నార్వే చెస్ 2026 టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సత్కరించారు. చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో ప్రజ్ఞానందను కలిసిన సీఎం విజయ్.. తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ తరఫున ఆయనకు రూ.50 లక్షల ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ ప్రజ్ఞానందతో కొద్దిసేపు చెస్ కూడా ఆడారు. నార్వే చెస్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో టైటిల్ గెలవడం తమిళనాడుకే కాదు, దేశానికే గర్వకారణమని ఆయన అభినందించారు.
ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు. చివరి రౌండ్లో జర్మనీ ఆటగాడు విన్సెంట్ కీమర్‌ను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకున్నారు. ఈ విజయం భారత చెస్‌కు మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచ చెస్‌లో భారత యువ ఆటగాళ్లు వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. ఆ జాబితాలో ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్‌తో ప్రత్యేక స్థానం సంపాదించారు.
