Nag Ashwin Simplicity | సింగ్ గీతం ఈవెంట్ లో అందరినీ ఆకట్టుకున్న సీన్
Nag Ashwin Simplicity | సింగ్ గీతం ఈవెంట్ లో అందరినీ ఆకట్టుకున్న సీన్
Nag Ashwin Simplicity | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చిన్న సినిమాల నటులు, దర్శకులే సెలబ్రిటీలుగా భావిస్తున్న ఈ రోజుల్లో కూడా, దర్శకుడు నాగ్ అశ్విన్ తన సింప్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభాస్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కల్కి లాంటి పాన్ ఇండియా సినిమా చేసినప్పటికీ ఆయన వినయాన్ని ప్రదర్శించారు. నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన సింగ్ గీతం సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఆదిత్య 369, పుష్పక విమానం వంటి క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమల్ హాసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గెస్టులకు సీటింగ్ సరిపోకపోవడంతో నాగ్ అశ్విన్ కమల్ హాసన్ పక్కనే నేలపై కూర్చొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ కార్యక్రమంలో ఆయన కల్కి 2 గురించి కూడా మాట్లాడారు. కల్కి 2 షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, జూలై నుంచి షూటింగ్ వేగంగా కొనసాగుతుందని తెలిపారు.
సింగ్ గీతం సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది
