Norway Chess 2026 | జర్మనీకి చెందిన విన్సెంట్‌ను ఓడించి భారత గ్రాండ్ మాస్టర్
Norway Chess 2026 | జర్మనీకి చెందిన విన్సెంట్‌ను ఓడించి భారత గ్రాండ్ మాస్టర్
Norway Chess 2026 | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారతీయ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ ‘నార్వే చెస్ 2026’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. డీచ్‌మాన్ బ్జోర్వికాలో జరిగిన 10వ, చివరి రౌండ్‌లో జర్మనికి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించడంతో ఈ ఘనత సాధించారు. చివరిదైన పదో రౌండ్‌లో ప్రజ్ఞానంద రెగ్యులర్ గేమ్‌లో 45 ఎత్తుల్లో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలిచాడు. ఇది భారత చెస్ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయి, ఎందుకంటే మొదటిసారిగా భారత్‌కు చెందిన ఆటగాడు నార్వే చెస్ ఫెస్ట్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద్ విశిష్ట ప్రదర్శనతో కఠినమైన పోటీని ఎదుర్కొని టైటిల్‌ను పొందినట్లు చెస్ వర్గాలు పేర్కొన్నాయి.
