క్షణాల్లో కుప్పకూలిన భవనం..
క్షణాల్లో కుప్పకూలిన భవనం..
శిథిలాల కింద ఆరుగురు, ఒకరి మృతి
మరుపల్లి, ఆంధ్రప్రభ : మర్పల్లి మండల కేంద్రంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పాత భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం.
ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత భవనంలో నిర్వహిస్తున్న హోటల్‌లో ఆరుగురు వ్యక్తులు ఉండగా, ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరు మృతిచెందగా, ఆయన మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీశారు.
మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు, అధికారులు కలిసి శిథిలాలను తొలగిస్తూ గాలింపు చేపడుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
