Delivery Tragedy | ప్రాణాలు కోల్పోయిన తల్లీ, బిడ్డ

Delivery Tragedy | ప్రాణాలు కోల్పోయిన తల్లీ, బిడ్డ

Delivery Tragedy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళ ఆపరేషన్ సమయంలో మృతిచెందగా, ఆమె గర్భంలోని మగ శిశువును కూడా వైద్యులు కాపాడలేకపోయారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

జమ్మలమడుగులోని తాతిరెడ్డి రామలింగారెడ్డి ఆసుపత్రిలో ప్రసవ నొప్పులతో చేరిన మహిళకు వైద్యులు శస్త్రచికిత్స చేపట్టారు. అయితే ఆపరేషన్ సమయంలో పరిస్థితి విషమించడంతో తల్లితో పాటు మగ శిశువు కూడా మృతిచెందినట్లు సమాచారం.

వైద్యుల నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాలతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Leave a Reply