MI vs DC | ప్లేఆఫ్స్ బెర్త్ కోసం కీల‌క పోరు.. టాస్ గెలిచిన ఢిల్లీ !

ఐపీఎల్-2025 సీజన్‌ రసవత్తర ముగింపుకు దగ్గర పడుతోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌లో తమ స్థానం ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక్క బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోరు నెలకొంది.

ఈ నేపథ్యంలో, నేడు ముంబైలోని వాంఖడే మైదానంలో ముంబై-ఢిల్లీ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ ఫలితమే ప్లేఆఫ్స్ బెర్త్‌ను నిర్ణయించనుంది.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సొంత మైదానంలో ముంబై ఇండియ‌న్స్ ముందుగా బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది.

ఇక, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లు ఆడి 14 పాయింట్లతో పట్టికలో నాల్గో స్థానంలో ఉంది. మ‌రోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే, 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక ఢిల్లీ గెలిస్తే, ముంబైకు ప్లేఆఫ్స్ కాస్త క‌ష్ట‌త‌రం అవుతుంది.

ఈ నేపథ్యంలో రెండు జట్లూ పూర్తి స్థాయి ప్రణాళికలతో, సమిష్టిగా ఆడే ఉద్దేశ్యంతో మైదానంలోకి దిగనున్నాయి. అభిమానుల ఆసక్తి తారస్థాయికి చేరగా, ఈ మ్యాచ్ విజేతే ప్లేఆఫ్స్ రేసులోకి అడుగుపెట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *