Rain Alert | దక్షిణ తెలంగాణలో వర్షాల హెచ్చరిక

Rain Alert | దక్షిణ తెలంగాణలో వర్షాల హెచ్చరిక

Rain Alert |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌ : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ తుఫాను ఏర్పడుతున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే రాబోయే రెండు గంటల వ్యవధిలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.

రాబోయే రెండు గంటల్లో మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి – భువనగిరి అలాగే జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షపాతం 80 మిల్లీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

అంతేకాకుండా, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల పాటు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు, హైదరాబాద్ నగరంలో మాత్రం రాబోయే మూడు గంటల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ సమాచారం అందించింది.