RBI | రుణగ్రహీతలకు ఊరట..
RBI | రుణగ్రహీతలకు ఊరట..
కీలక నిర్ణయం తీసుకున్న ఆర్‌బీఐ
RBI | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి తక్షణ ఉపశమనం లభించినట్లైంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష (MPC) నిర్ణయాలను ప్రకటించారు.
5.25 శాతానికే రెపో రేటు…
ప్రస్తుత రెపో రేటును 5.25 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుత స్థాయిని కొనసాగించాలని ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయించినట్లు గవర్నర్ తెలిపారు. దీంతో బ్యాంకుల రుణ వడ్డీ రేట్లలో తక్షణ మార్పులు ఉండే అవకాశం లేదు.
వరుసగా మూడోసారి యథాతథ నిర్ణయం…
కీలక వడ్డీరేట్లను మార్పు చేయకుండా ఆర్‌బీఐ కొనసాగించడం వరుసగా మూడోసారి కావడం విశేషం. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, దేశీయ వృద్ధి అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఈ నిర్ణయం ఆర్థిక మార్కెట్లకు స్థిరత్వాన్ని అందించడంతో పాటు రుణగ్రహీతలకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.
