ఇల్లందు మున్సిపల్ కమిషనర్ గా సందీప్
ఇల్లందు మున్సిపల్ కమిషనర్ గా సందీప్
ఇల్లెందు జూన్3 (ఆంధ్రప్రభ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కమిషనర్ గా సందీప్ నియమితులయ్యారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన శ్రీకాంత్ మల్కాజ్గిరి మున్సిపాలిటీకి బదిలీ కాగా ఇల్లందు స్థానాన్ని గ్రూప్ వన్ కు చెందిన సందీప్ డైరెక్ట్ గా ఇల్లందు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సందీప్ ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ ఇల్లందు మున్సిపాలిటీ కమిషనర్ గా మొదటిసారి బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని, ఇల్లందు పట్టణ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు సాగుతానని, అదేసందర్భంలో విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు, వాటర్ టాక్స్, ప్రజలు సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
