2nd June2026 indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

2nd June2026 indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

నిన్న 44,393 మంది భక్తులకు అమ్మవారి దర్శనం
11,126 మందికి అన్నదాన సేవలు..
రూ.2.72 లక్షల విరాళాలు
ప్రసాదాలు, సేవలు, తలనీలాల సమర్పణతో కిటకిటలాడిన ఆలయం

2nd June2026 indrakeeladri | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని సోమవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దేవస్థానం గణాంకాల ప్రకారం ఈనెల 1వ తేదీ సోమవారం 44,393 మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోగా, 6,187 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. భక్తులకు 66,895 యూనిట్ల ప్రసాదాలు పంపిణీ చేయగా, హుండీలు, విరాళాల రూపంలో రూ.2,72,891 ఆదాయం సమకూరింది. ఆలయంలో 277 సేవలు నిర్వహించగా, 1,903 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

అలాగే దేవస్థానం నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో 11,126 మంది భక్తులు పాల్గొని ప్రసాద భోజనాన్ని స్వీకరించారు. పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా కనిపించగా, దేవస్థానం అధికారులు దర్శనం, ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, అమ్మవారి సన్నిధి భక్తి పారవశ్యంతో నిండిపోయింది.

CLICK HERE TO READ 1st June2026 indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం

CLICK HERE TO READ MORE

Leave a Reply