అవిశ్రాంత పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావం ..

నర్సంపేట, ఆంధ్రప్రభ: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు, అవిశ్రాంత పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ, వైస్ చైర్మన్ గంధం నరేందర్, పీసీసీ సభ్యులు పెండెం రామానంద్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబీ వంశీ, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి కిరణ్ పాల్గొన్నారు.
అలాగే కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, వేముల సంధ్య సాంబయ్య, పొన్నాల మనీషా, చీకటి స్వరూప ఓదేలు, కాంపెల్లి వీణ విజేందర్ రెడ్డి, వేల్పుల శ్రీలత, మాదాసి రవి, ఎలకంటి విజయ్ కుమార్, బాణాల ప్రసన్న, మేఘన శ్యామ్, మత్తు రాథోడ్, ఇస్లావత్ రామ గోపి, అయూబ్, చింతల సాంబరెడ్డి, బైరి మురళి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
