అమరవీరుల స్ఫూర్తికి ఘన వందనం…

హన్మకొండ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం హన్మకొండ అదాలత్ సర్కిల్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయి తదితరులు పాల్గొన్నారు.
నాయకులు, అధికారులు అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు.
