బదిలీపై వెళ్తున్న సీనియర్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

బదిలీపై వెళ్తున్న సీనియర్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

ముధోల్, ఆంధ్రప్రభ:
ముధోల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి, బదిలీపై వెళ్తున్న ఖాజా నజీమ్ ఉద్దీన్‌కు ఘన సన్మానం నిర్వహించారు. మాజీ ఎంపీపీ ఆఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ, ఖాజా నజీమ్ ఉద్దీన్ గత ఆరున్నర సంవత్సరాలుగా నిస్వార్థంగా విధులు నిర్వహించారని అన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నర్సాపూర్‌కు వెళ్లడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.

ఎంపీపీగా తాను పనిచేసిన నాలుగేళ్ల కాలంలో ఖాజా నజీమ్ ఉద్దీన్ అందించిన సేవలు మరువలేనివని ఆఫ్రోజ్ ఖాన్ కొనియాడారు. ప్రజలకు, కార్యాలయానికి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లవ కుమార్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు మక్దూమ్, మాజీ సర్పంచ్ గౌతమ్, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply